16-08-2024 12:00:00 AM
10 బేసిస్ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్‌ఆర్
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. తాజా చర్యతో కొన్ని కాలపరిమితుల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ ఆధారిత వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పెరుగుతుంది. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రేటుపై ఆటో, వ్యక్తిగత తదితర వినియోగ రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐలు మ రింత భారం కానున్నాయి. కొత్తగా వినియో గ రుణాలు తీసుకునేవారూ ఎక్కువ వడ్డీకి సిద్ధం కావాల్సిందే. పెంచిన ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు) 2024 ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో సైతం ఎస్బీ ఐ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఎంసీఎల్‌ఆర్ ఆధారిత వడ్డీ రేట్లు 8.20 శాతం శ్రేణిలో ఉన్నాయి. తాజా పెంపుదల ఇలా..