25 August, 2026 | 1:41 AM

అబ్బవరం నిర్మాణంలో మరో చిత్రం

25-08-2026 12:00 AM

ఓ వైపు నటుడిగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. మరోవైపు కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి నిర్మాణం వైపు దృష్టి సారిస్తూ, నూతన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. తన సొంత బ్యానర్‌పై ఇటీవల ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి మరో ప్రాజెక్టును ప్రకటించారు. ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం సమర్పకుడిగా వ్యవహరిస్తూ, వై శివశంకర నాయుడుతో కలిసి నిర్మిస్తున్నారు.

అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పక్షి కాళ్లను చూపిస్తూ, ‘ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్‌ను మీరు ఊహించలేదు..’ అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్షన్ బాధ్యతలు అనూష్ గోరక్ నిర్వహిస్తుండగా, జేసిన్ జార్జ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖిల్ చక్రవర్తి ఎడిటర్‌గా, మక్కెన విజయ్ కుమార్, జీమోన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.