calender_icon.png 6 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఏలో చేర్చుకుంటే మరో ఉద్యమం

06-09-2025 12:00:00 AM

రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ 

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ముదిరాజ్ లను ఏ గ్రూపులో ప్రభుత్వం కలుపుతుందని నమ్మకం ఉందని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజుల లో ఐక్యత లోపం అనే సమస్య వల్ల సతమతమవుతున్నారని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ తెలిపారు.

కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ స్కూలులో సర్వేపల్లిరాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముదిరాజ్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం గర్వనీయమన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల బడ్జెట్ ఇవ్వాలని,  తక్కువ బడ్జెట్ ఇచ్చారనీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహాసభ అధ్యక్షులు  కరాటే రమేష్ కుమార్ అన్నారు. ముదిరాజులను ఏ గ్రూపులో చేర్చకుంటే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

కాంగ్రెస్ సర్కారు ముదిరాజులకు న్యాయం చేయకుంటే కాంగ్రెస్   కూడా గద్దె దించుతారనీ హెచ్చరించారు. రాష్ట్రంలో 40 వివిధ రకాల స్థాయిల్లో ముదిరాజ్ సంఘాలు ఉన్నాయని, ఇంటింటికి  చైతన్య పరచాల్సిన అవసరం ఉందనీ మాజీ జిల్లా గ్రంథాలయ సమస్త చైర్మన్ పున్న రాజేశ్వర్ అన్నారు. 

కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు భూపాల్  విజయానంద్, బార్  అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్,  జిపీ న్యాయవాది, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జల బిక్షపతి, నిజ్జన రమేష్, మహేష్, జయ ప్రకాష్ యువసేన అధ్యక్షులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.