17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో కొత్త కోర్సు మంజూరు

04-06-2025 12:04 AM

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్

కామారెడ్డి, జూన్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి  ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల {స్వయం ప్రతిపత్తి),కామారెడ్డిలో ఈ విద్యా సంవత్సరం నుండి B.Sc( హెల్త్ కేర్ మేనేజ్మెంట్) (ఏఈడిపి) ప్రవేశపెడు తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  డిగ్రీలో B. A, B. Sc లైఫ్ సైన్స్,B.Sc ఫిజికల్ సైన్స్, B. Sc (హానర్స్ ) కంప్యూటర్ సైన్స్, B. Com కంప్యూటర్ అప్లికేషన్స్, BBA,  కోర్సులు నిర్వహి స్తుండగా

ఈ విద్యా సంవత్సరం నుండి B. Sc (హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ) (ఏ ఈడిపి) అందుబాటులో రానున్నట్లు ఈ కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ లో ఈ కోర్సును  ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో  యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తూ  బోధనలో సాంకేతికత,డిజిటల్ క్లాసులు కలిగి 60 వసంతాలకు పైగా విద్యాసేవనిందిస్తున్న విశిష్ట కళాశాల ప్రభుత్వ ఆరట్స్ అండ్  సైన్స్ కళాశాలని, 

డిగ్రీలో దోస్త్ రెండో విడత ఈ నెల 8వ తారీకు వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు   అవకాశాన్ని   వినియోగించు కొని కళాశాలలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని  కామారెడ్డి  ప్రాంత విద్యార్థులను కోరారు.