4 August, 2026 | 11:56 AM

హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం: కేటీఆర్

04-08-2026 10:48 AM

హైదరాబాద్: హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ (350 kg thrust-class expendable turbojet engine)ను విజయవంతంగా తయారు చేసి ఆజాద్ ఇంజనీరింగ్ అఫీషియల్, డిఆర్‌డిఓ ఇండియా డెలివరీ చేసింది. ఆజాద్ ఇంజనీరింగ్, డిఆర్‌డిఓ ఇండియా సాధించిన విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. 

ఈ ఇంజిన్ భారతదేశపు స్వదేశీ చోదక సామర్థ్యాలను, రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని, జెట్ ఇంజన్ టెక్నాలజీకి అసాధారణమైన కచ్చితత్వం, అధునాతన లోహశాస్త్రం ప్రపంచ స్థాయి తయారీ అవసరం అని ఆయన వెల్లడించారు. ఈ విజయం, దశాబ్దాలుగా నిర్మించబడి, గత దశాబ్ద కాలంలో గణనీయంగా బలపడిన హైదరాబాద్ ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఎకోసిస్టమ్ బలాన్ని ప్రతిబింబిస్తుందని కేటీఆర్ కొనియాడారు. 

హైదరాబాద్ ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ పురోగతికి జెట్ ఇంజిన్ ఉత్పత్తే నిదర్శనమని, డిఫెన్స్ ప్రొపల్షన్ రంగంలో స్వయం సమృద్ధికి ముందడుగు అన్నారు. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ హబ్ గా హైదరాబాద్ మారిందని కేటీఆర్ తెలిపారు.