calender_icon.png 8 January, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి జిల్లాల పునర్‌విభజన

07-01-2026 12:43:16 AM

క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతోనే..

కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను గుర్తించాం 

అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో ఆశాస్త్రీయం గా ఏర్పాటుచేసిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను మళ్లీ పునర్‌వ్యవస్థీకర ణ చేస్తామని రెవెన్యూ, హౌసింగ్‌శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించా రు. మ్యాజిక్ ఫిగర్ కోసమే రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను గత ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించిందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నో త్తరాల సమయంలో సభ్యులు  రామ్మోహన్‌రెడ్డి, వేముల వీరేశం, పాల్వాయి హరీశ్ తది తరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వ తప్పిదాలతో ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలా లు.. నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరి అభ్యర్థనలను పట్టించు కోకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని విమర్శించారు. తమను పొగిడిన వారి కోసం ఒకవిధంగా, పొగడని వారి కోసం మరో విధంగా, తమ అదృష్ట సంఖ్యను ఊహించుకుని, అన్ సైంటిఫిక్‌గా జిల్లాలను విభజించారని, వాటిని ఇప్పుడు సైంటిఫిక్‌గా ఏర్పాటుచేస్తామని వివరించారు. కొన్ని జిల్లాల్లో మండలాల సంఖ్య తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఈ నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలు, రెవె న్యూ డివిజన్ల ఆవశ్యకతను గుర్తించామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయ కత్వంలో క్యాబినెట్‌లో విస్తృతంగా చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతామ, ఈ విషయంలో అధికారుల నుంచి నివేదిక తెప్పించి, శాసనసభలో చర్చ చేపట్టిన తర్వాత అందరి ఆమోదంతో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.