19-08-2025 12:32:39 PM
హైదరాబాద్: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని నదులు, జలాశయాలలో వరద నీటి ప్రవాహానికి దోహదం చేస్తున్నాయి. కృష్ణా నదిలో వరద నీరు పెరిగి.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు ఉప్పొంగుతోంది. ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు(బ్యారేజీ) చేరుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈరోజు సాయంత్రానికి ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ(APSDMA) సూచించింది. అలాగే బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేశారు. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా, భారీ వర్షాల కారణంగా కాలువలు, వాగులు ఎక్కువగా ఉప్పొంగిపోతున్నందున వాటిని దాటవద్దని ప్రజలకు సూచించారు.