19-08-2025 12:35:16 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్(CI Daggu Mallesh Yadav) మృతుని కుమారులు బుర్ర చక్రపాణి, దేవేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రఘు, బుర్ర నాగరాజు పాల్గొన్నారు.