calender_icon.png 19 August, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దవాఖాన బిల్లుల కోసం.. ఎదురుచూపులేనా?

19-08-2025 12:37:39 PM

ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే.. దవాఖాన భవనం పూర్తిస్థాయిలో పనులు.

13కోట్ల పైన పనులు పూర్తి.. కేవలం 1కోటి 30 లక్షలు మంజూరు.

ఆర్థిక ఇబ్బందుల్లో... ఏరియా దవాఖాన కాంట్రాక్టర్.

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యముతో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సుమారు 35 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఏరియా దవాఖాన నిర్మాణ పనులు ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో, ప్రారంభించి పనులు కొనసాగుతున్నాయి. ఏరియా దవాఖాన సదర్ కాంట్రాక్టర్ నవీన్ కుమార్ నిర్మాణ పనులు త్వరితగతంగా కొనసాగింపచేశారు. మొదటి దశలో సుమారు 18 నెలలు పనిచేసిన, 13 కోట్ల వ్యయంతో అప్పులు తెచ్చి బిల్లింగ్ నిర్మాణ పనులు చేపట్టారు.

ప్రభుత్వం మొదటి దపాలో కేవలం 1 కోటి 30లక్షల నిధులు మాత్రమే మంజూరు చేసింది. దీనితో కాంట్రాక్టర్కు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా మారింది. మిగతా డబ్బులు 18 నెలలు దాటిన బిల్లులు పెట్టినప్పటికీ, నేటి వరకు కూడా తిరిగి బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా దవాఖాన నిర్మాణ పనులు తిరిగి కొనసాగాలంటే  తక్షణమే యుద్ధ ప్రాతిపదికమైన జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కోరుతున్నారు.

దవాఖాన నిర్మాణ పనులు కొనసాగాలంటే.. బిల్లులు మంజూరు చేయాలి

ఏరియా దవాఖాన కాంట్రాక్టర్ (నవీన్ కుమార్)

గడిచిన 18 నెలల తరబడి సుమారు 35 కోట్ల తుంగతుర్తి ఏరియా దవాఖాన నిర్మాణ పనులకు గాను ప్రస్తుతం 13 కోట్లకు పైగా పనులు వేగవంతంగా చేశాము. కేవలం మాకు ప్రభుత్వం నుండి ఒక కోటి 30 లక్షలు మాత్రమే చెల్లింపులు చేశారు. మిగతా బిల్లులు పెట్టి నెలలు గడుస్తున్నామాకు డబ్బులు రాలేదు. ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాం. జిల్లా మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చొరవతో, తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుచున్నాము.