మావోయిస్టు చేతిలో మరో మహిళ హతం
24 గంటలు గడవకముందే మరో హత్య
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సిపిఐ ఎంఎల్ మావోయిస్టు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. లక్ష్మీ అనే అంగన్వాడి టీచర్ను హతమార్చి 24 గంటలు గడవకముందే మరో మహిళను గొంతు కోసి హతమార్చిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దెడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోడెడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో కెళ్తే తెలంగాణ పోలీస్ ఇన్ ఫార్మర్ అని ఆరోపిస్తూ లోడెడ్ గ్రామానికి చెందిన శుక్ర యాలం, ఆమె భర్త రామయ్యను ఈనెల ఏడవ తేదీన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. రామయ్యను కర్రలతో విపరీతంగా కొట్టి విడుదల చేశారు.
అనంతరం శుక్రవారం గొంతు కోసే హతమార్చారు తెలంగాణ పోలీసులకు ఆమె ఎన్ ఫార్మర్ గా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున మరోసారి మెరుపు దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే బీజాపూర్ జిల్లా పరిధిలోని పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి పోలీస్ క్యాంప్-2 పై మెరుపు దాడి చేశారు. పోలీసులే టార్గేట్టుగా నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనుకొని సంఘటనకు వెంటనే చేరుకున్న పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






