17 April, 2026 | 11:46 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిబద్దత కలిగిన కమ్యూనిస్టు నేతను కోల్పోయాం

08-12-2024 05:36 PM

కొత్త పిచ్చయ్య అందించిన సేవలు మరువలేనివి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిబద్దత కలిగిన కమ్యూనిస్టు నాయకుడిని కోల్పోయామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. రైతు సంఘం(AIKS) మాజీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్త పిచ్చయ్య 3వ వర్థంతి సందర్భంగా ఆదివారం సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాండురంగపురం గ్రామంలో ఉన్న పిచ్చయ్య స్మారక స్థూపం వద్ద ఎర్రజెండాను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లడుతూ.. పాల్వంచ మండలంలో పార్టీ, ప్రజాసంఘాల విస్తరణకు అనలేని కృషి చేస్తూ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా అందించిన సేవలు మరువలేనివి అని ఆయన సేవలను స్మరించుకున్నారు.

సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం అనునిత్యం శ్రమించే వాడని, పాలు గ్రామాల ప్రజలను కమ్యూనిస్టు ఉద్యమాల వైపు మళ్లించి పార్టీ, ఏఐటియుసి విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించిన నాడే ఆయనకు ఘనమైన నివాళులర్పించిన వారు అవుతామని, నాయకులు కార్యకర్తలు ఈ బాధ్యతలు స్వీకరించి ఆయన ఆశయాలను సాధించాలని కోరారు. ఆయన ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తూ నిత్యం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్మించాలని తద్వారా పాల్వంచ ప్రాంతంలో సిపీఐని అగ్రస్థానంలో నిలపాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, గుండాల నాగరాజు, సీపీఐ ప్రజాసంఘాల నాయకులు ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాస్ రావు, నరహరి నాగేశ్వరరావు, ముత్యాల కిరణ్ కుమార్, మనేం వెంకన్న, జకరయ్య, లింగేశ్వర్, కొంగర అప్పారావు, ఇరుకులపాటి సుధాకర్, నెల్లూరు సతీష్, సత్యనారాయణ, ఎర్రగడ్డ ప్రభాకర్, లాల్ పాషా, పిచ్చయ్య కుమారుడు కొత్త సురేష్, సతీమణి సులోచన, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.