2 April, 2026 | 2:47 AM

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి

02-04-2026 12:54 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయవద్దని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల క్లాత్ క్రింద కార్మికులు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వంగూరి రాములు, ఏఐటిసి జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్, సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఐఎఫ్టియు జిల్లా నాయకులు శ్రీధర్, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఇప్పటివరకు కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చి కార్మికుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతుందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కుంట్ల నాగన్న, బానోత్ శంకర్, కోటేశ్వరరావు, పాల బిందెల మల్లయ్య, వాసం దుర్గారావు, నర్ర శ్రావణ్, శంకర్, సోమయ్య, హలవత్ లింగన్న, కోటేష్, జబ్బర్, కొత్తపల్లి రవి, శంకర్, కోటేశ్వరరావు, సతీష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.