30-12-2025 02:38:13 PM
కేసముద్రం,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. వందల సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.