17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

క్రెడిట్ కోసం పాకులాట?

07-04-2025 12:46 AM
  1. మద్నూర్ టు బోధన్ హైవే రోడ్డు మంజూరు పై ప్రెస్ మీట్ 

నేనంటే నేను అంటున్న ప్రజాప్రతినిధులు 

ఇంతకీ మంజూరు ఎవరు చేసినట్టు?

అయోమయంలో ప్రజలు 

జుక్కల్ ఎప్రిల్ 6 (విజయక్రాంతి) : జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రం నుంచి రుద్రూర్ బోధన్ నిజాంబాద్ వరకు మంజూరు అయిన నేషనల్ హైవే 161ఏ రోడ్డు పనులు నేనంటే నేను మంజూరు చేయించాను అని మాజీ ఎంపీ బీబీ పాటిల్, ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుల మధ్య సభ సమావేశాలలో పేర్కొనడం కలకలం రేగుతోంది.

2025 మార్చి 11న నిజాంసాగర్ లో జరిగిన ఒక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తన హయాంలోనే మంజూరు అయిందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కి, రాష్ర్ట మంత్రికి విన్నవించడం ద్వారా ఈ రోడ్డు పనులకు 156 కోట్లు అయ్యాయని చెప్పడం జరిగింది. అయితే ఇది తప్పు అని బిజెపి నాయకులు నెల క్రితమే ఖండిస్తూ గతంలో బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న సమయంలోనే మంజూరు చేయించినట్లు మాజీ ఎంపీ బీబీ పాటిల్ వర్గీయులు కూడా మద్నూర్ లో ప్రెస్ మీట్ ఇచ్చారు. అయితే ఈ వార్తలను చూసి ప్రజలు ఎవరు మంజూరు చేయించారు.

అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నా లేకుంటే మాజీ ఎంపీ బీబీ పాటిల్ మంజూరు చేయించిందా అనేది చాలామందికి తెలియకుండా పోతుంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య ఈ విధంగా రోడ్డు విషయం కొనసాగుతుండగా ప్రజలకు మాత్రం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వారు చెప్తున్నారు.

మద్నూర్ నుంచి వయా రుద్రూర్ మీదుగా బోధన్ వరకు ఈ నాలుగు లైన్ల రోడ్డు నేషనల్ హైవే 161ఏ పనులకు మొత్తం రూ. 750 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం రూ.429 కోట్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ఈ రోడ్డు పొడవు 38 కిలోమీటర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్న దాంట్లో రూ.156 కోట్లు మంజూరైనట్లు చెప్పడంతో అందరూ అయోమయంలో ఉన్నారు.

అసలు ఎవరు మంజూరు చేయించారు, ఎవరి హయాంలో జరిగింది, ఎంత మంజూరు జరిగింది అనేదానిపై క్లారిటీ లేకపోవడంతో దిక్కుతోచడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా నేనంటే నేను అని చెప్పుకోవడంతో సందిగ్ధత నెలకొంది.

ఎవరు మంజూరు చేయించిన పనులు జరిగితే అదే సంతోషం అని కూడా కొందరు భావిస్తున్నారు. కానీ క్రెడిట్ కోసం ఇద్దరు ప్రజలు ప్రజాప్రతినిధులు పాకులాడటమే విడురంగా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.