calender_icon.png 12 November, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూర్పుగోదావరిలో ఘోర ప్రమాదం: ఏడుగురు కూలీలు మృతి

11-09-2024 10:09:36 AM

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిపై చిలకవారిపాకలు గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఇరిగేషన్ కాలువలోకి మినీ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం మండలం (ఏలూరు జిల్లా) బొర్రంపాలెం గ్రామం నుంచి నిడదవోలు మండలం (తూర్పుగోదావరి జిల్లా) మండలం తాడిమళ్ల గ్రామానికి జీడిపప్పును తరలిస్తున్న లారీ డ్రైవర్‌ అదుపు తప్పి రోడ్డుపై నుంచి దూసుకెళ్లింది. జీడిపప్పు బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు జరుపుతున్నారు.