calender_icon.png 19 November, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొంగిపోతే మంచిది.. మావోయిస్టులకు లడ్డా డెడ్‌లైన్‌

19-11-2025 09:57:19 AM

  1. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్‌..
  2. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నాలు..
  3. పూర్తి సమాచారంతోనే ఆపరేషన్‌ చేశాం.. 
  4. మావోయిస్టుల అరెస్టుపై కీలక విషయాలు వెల్లడి..
విజయవాడ: మావోయిస్టులు త్వరగా లొంగిపోవడం మంచిదని ఏపీ ఇంటెలిజన్స్‌ ఏడీజీ  మహేష్‌ చంద్ర లడ్డా(AP Intelligence ADG Mahesh Chandra Laddha) సూచించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామన్నారు. మావోయిస్టులకు మార్చి 26 వరకు ఏడీజీ లడ్డా డెడ్ లైన్ విధించారు.ఎవరైనా మావోయిస్టులు ఉంటే వచ్చి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వాళ్లళో ఒక్కరినీ తాము ఎన్ కౌంటర్ చేయలేదని చెప్పారు. ఎన్ కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చిని తెలిపారు. నిన్న విజయవాడలో అరెస్టు అయిన మావోయిస్టుల వివరాలను ఏడీజీ  మహేష్‌ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.  ఛత్తీస్ గఢ్ లేదా తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి మావోయిస్టుల కదిలికలను గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిన్నటి తనిఖీల్లో భారీగా ఆయుధ సమాగ్రి, పేలుడు పదార్థలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.  నిన్న మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని వెల్లడించారు.

తప్పించుకున్న మావోయిస్టులను కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని సూచించారు. మావోయిస్టుల ప్లాన్ ఏంటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లో ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నందున మరో చోటకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసిందన్నారు. తెలంగాణ లేదా మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో పట్టబడ్డారని ఏడీజీ తెలిపారు. ముందుగా రక్షణ బృందాలను పంపంచి తర్వాత కీలక నేతలు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఆరు నుంచి ఏడు మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏడీజీ  మహేష్‌ చంద్ర లడ్డా పేర్కొన్నారు.