6 August, 2026 | 3:26 AM

ఏపీ అంటే అమరావతి, పోలవరం!

21-06-2024 01:58 AM
  • సీఎం చంద్రబాబు వెల్లడి

రాజధాని నిర్మాణాలు పరిశీలన

హైదరాబాద్, జూన్ 20 ( విజయక్రాంతి)ః ఏపీ అంటే  అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్యను వైఎస్సార్ సీపీకి కలిపితే  ఆ పార్టీకి వచ్చిన సీట్లతో సరిపోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతోనే పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్పూర్తిగా నమస్కారాలు పెడుతున్నా’ అని అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందని  ఉద్దేశంతో దాన్ని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

అంతే కాకుండా రాయలసీమ రతనాల సీమగా మారుతుందని, అందుకే విభజన చట్టం తోడ్పాటును తీసుకున్నామన్నారు. పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపివే సిందన్నారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారందన్నారు. కేంద్రం నిధులతో పోలవరం కట్టి ఇక్కడి నీటివనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. పోలవరం సందర్శించా చాలా బాధవేస్తోందని, ప్రజావేదికను కూల్చి జగన్ పాలన ప్రారంభించారన్నారు. పవిత్ర జలాలు, మట్టితో ప్రధాన శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టే ఆ మట్టే మనల్ని కాపాడిందన్నారు.

కొన్ని అల్లరి మూకలు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను కూడా ధ్వంసం చేశాయని, అమరావతి రైతులు వాటిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎక్కడ కట్టిన బిల్డింగ్‌లు అక్కడే ఉన్నాయి. ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయి. ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఐఏఎస్, ఏపీఎస్‌ల భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మ చెట్లు మొలిచాయన్నారు. కేంద్రం ఇ చ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలోని 11 కేంద్రీ య విద్యాసంస్థలను ఏర్పాటు చేశామన్నారు. శిమరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగా సెంట్రల్‌లో అమరావతిని ఏ ర్పాటు చేశాం.

అయి నా బుదరజల్లే ప్రయత్నం చేశారన్నారు. విషం చిమ్మి సింగపూర్ కన్సార్టియంను తరమివేశారని, మూడు రాజధానలు పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. రుషులు తపస్సు లు చేసిన ప్రాంతం రుషి కొండను నాశనం చేశారు ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. లెక్కలు చూపించి చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తీసుకు వచ్చారన్నారు. హిరోషిమా, నాగసాకిని స్పూర్తిగా తీసుకుని ప్రజావేదికను జగన్ విధ్వంసానికి గుర్తుగా అలానే ఉంచుతామన్నారు. గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు. లేకుంటే ఊరుకున్నారు. జగన్‌లా మాత్రం చేయలేదని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో గత ప్రభుత్వంపై మండి పడ్డారు.