14-05-2025 11:58:39 PM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి(Additional Collector Deepak Tiwari) అన్నారు. బుధవారం కెరమెరి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... నిరుద్యోగ యువ-తకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రాజీ యువ వికాసం పథకంలో అందిన దరఖాస్తులను పరిశీలించి నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అర్హత గల ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రక్రియను పరిశీలించి నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. మండలంలో అర్హత గల లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా రూపొందించాలని తెలిపారు. మండలంలోని శివగూడ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులలో భాగంగా మంచినీటి బావి మరమ్మత్తులు, చెక్ డ్యామ్ నిర్మాణం, మిషన్ భగీరథ నీటి సరఫరా పనులను పరిశీలించారు.
అనంతరం గ్రామీణ నీటి సరఫరా ఈఈ, మండల ప్రత్యేక అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎ.ఈ.ఈ., ఉపాధి హామీ పథకం ఎ.పి.ఓ. లతో నిర్వహించారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలలో చేతిపంపుల మరమ్మతులు, అవసరమైన చోట నీటి రవాణా, భూగర్భ జలాల అభివృద్ధి, సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం సంబంధిత చేపట్టాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.