calender_icon.png 29 August, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణనాథునికి వినతి

29-08-2025 12:39:30 PM

హుజురాబాద్:(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్(Pending scholarships) లను విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని వినాయక మండపంలో విఘ్నేశ్వరునికి ఏబీవీపీ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం తొలగించి విద్యార్థుల కు పెండింగ్లో ఉన్న  స్కాలర్షిప్లను విడుదల చేసేటట్లు బుద్ధి ప్రసాదించాలని విగ్నేశ్వరుని  కోరినట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోస మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు పథకాల పేరిట రాష్ట్రాన్ని ఆగం చేసే ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యార్థులకు రావల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న 8300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని దాని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందరం లేదని అన్నారు. విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అంజి, నగర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, బన్నీతో పాటు తదితరులు పాల్గొన్నారు.