14-05-2025 01:37:54 AM
చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు కే. విద్యా సాగర్
పెద్దపల్లి, మే 13(విజయక్రాంతి) : జూన్ 5 లోపు ఐ.ఐ.హెచ్.టి. లో ప్రవేశం కొరకు దరఖాస్తు సమర్పించాలని చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు కే. విద్యా సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఒడిస్సా రాష్ట్రం నందు మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు మొదటి సంవత్సరం 2025-26 తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని, చేనేత టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, 2025-26 విద్యా సంవత్సరానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐ.ఐ.హెచ్.టి) బరఘ నందు మూడు సంవత్సరాల హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లోమా కోర్సు కు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు, 17 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అర్హులని తెలిపారు.
ఆసక్తి అర్హత కలిగిన యువకులు తమ దరఖాస్తులను సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ కరీంనగర్ కార్యాలయానికి జూన్ 5 లోపల సమర్పించాలని చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు కే. విద్యా సాగర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.