calender_icon.png 14 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత ఇప్పట్లో లేనట్లే

14-05-2025 01:37:55 AM

మీడియా సమావేశంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి

వేములవాడ,మే13(విజయ క్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  ఆలయ పునర్నిర్మాణ ఏర్పాట్లపై ఆలయ ఈవో వినోద్ రెడ్డి మీడియా సమావేశంలో మంగళవారం క్లారిటీ ఇచ్చారు. వచ్చేనెల జూన్ 15న ఆలయం మూసి వేస్తున్నట్లు వస్తున్న వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని, అది కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు.

రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడితే ముందుగా వచ్చేటటువంటి భక్తులకు భీమేశ్వర ఆలయంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. శృంగేరి పీఠాధిపతి అనుమతులు, దేవాదాయ ధర్మదాయ శాఖ సలహాలు సూచనలు,

రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు, స్థానిక ఎమ్మెల్యే కృషితో ఆలయాన్ని సర్వంగ సుందరంగా.తీర్చిదిద్దబోతున్నట్లు దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణ పనులు ఎప్పుడు చేపడతామన్నది మరికొద్ది రోజుల్లోనే మీడియా ముందు స్పష్టత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.