15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

27-05-2025 06:58 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(University College of Engineering), కాకతీయ విశ్వవిద్యాలయం, కొత్తగూడెంలో బీటెక్ కోర్స్ చేయుట కొరకు దరఖాస్తులు కోరడమైనదని ఏరియా జియం వి.కృష్ణయ్య(Area Gm V. Krishnaiah) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు ఈ క్రింద తెలిపిన వివిధ విభాగాలలో కేటాయించారని తెలిపారు.

మైనింగ్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, ఎలక్ట్రికల్ & ఎలెక్ట్రోనిక్ ఇంజనీరింగ్ 2, ఎలెక్ట్రోనిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2  మొత్తం 10  ఇట్టి దరఖాస్తు చేసుకునే యువతి యువకులకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రము నిర్వహించిన 2024-25 ఎంసెట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు లో హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ స్పష్టంగా నమోదు చేయాలి. దరఖాస్తులో 2024-25 ఎంసెట్ మెరిట్ యొక్క జిరాక్స్ కాపీ సమర్పించాలి. దరఖాస్తులో కుల ధ్రువీకరణ పత్రం, స్తానికం/నాన్-లోకల్ సమర్పించాలి. కౌన్సిలింగ్ సమయంలో ఉద్యోగి యొక్క ఐ.డి. కార్డును సమర్పించాలి. కౌన్సిలింగ్ లో ఎంపికైన అభ్యర్ధులు ప్రవేశ రుసుము చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు లను జూలై నెల 14వ తేదీ లోపు అందజేయాలిని తెలియజేశారు.