calender_icon.png 23 January, 2026 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రాణదానంతో సమానం

23-01-2026 08:55:38 PM

నేతాజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ వైద్యుల రక్తదానం

సిద్దిపేట క్రైం: రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంగీత, ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి ముదిరాజ్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని పలువురు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి  వైద్యులు శుక్రవారం రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయవచ్చన్నారు.  ప్రమాదాల్లో గాయపడిన వారికి, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు, శస్త్రచికిత్సలు జరిగే సమయంలో  రక్తం అత్యవసరంగా ఉపయోగపడుతుందని వివరించారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేయడం ఉత్తమ సేవ అని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు లక్ష్మారెడ్డి, వేణుగోపాలచారి, రాజ్‌కుమార్, రమేష్, సాగర్, హరిష్, బాలు, పాండ్యన్, కృష్ణప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు.