17 August, 2026 | 6:42 PM

కోనరావుపేట ప్రజావాణిలో 15 దరఖాస్తులు

17-08-2026 06:07 PM

కోనరావుపేట ఆగష్టు 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోనరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్  కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో స్నిగ్ధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మితో పాటు  వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 15 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎంపీడీవో స్నిగ్ధ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.