22 July, 2026 | 1:43 AM

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

22-07-2026 01:10 AM
  1. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
  2.  10 వేల మందితో ఉద్యమిస్తాం: మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నల్లగొండ టౌన్, జులై 21 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చే స్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ స మావేశం_ నిర్వహించారు.ఎమ్మెల్సీ కోటిరె డ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లోనే అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింద ని ఆరోపించారు.

విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సమాజం బ్రష్టు పడుతుందనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తమ వద్దే ఉంచుకున్నారని విమర్శించారు. పెండింగ్ ఫీజులు విడుదలయ్యేదాకా బీఆర్‌ఎస్ విద్యార్థులు, కళాశాలలకు అండగా ఉంటుందని, శాసన మండలిలో ఈ అంశంపై పోరాడతామని భరోసా ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.

నల్లగొండ మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్ టూర్లకు 15 లక్షలు ఖర్చు చేయగలుగుతున్నారని, కానీ విద్యార్థుల ఫీజులకు డబ్బులు లేవని అనడం సరికాదన్నారు. ఈ అంశంపై 10 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య సామాజిక సమస్య అని, పేద, బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసే కుట్ర అని అన్నారు.

మూసి ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీకి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని, కానీ పేద విద్యార్థుల చదువులకు డ బ్బులు లేవనడం దుర్మార్గమన్నారు. 11వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రై వేట్ కాలేజీలు ఇంజనీరింగ్ ఫార్మా కాలేజీ లు మూతపడుతున్నాయని, ప్రభుత్వ కాలేజీల్లో బోధన సిబ్బంది వసతులు మెరుగుపరచడం లేదన్నారు. అంతర్గతంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు సహకరిస్తున్నట్లు ఆరోపించారు.

పేదరికంపోయందుకు విద్యనే మూల కారణం అన్నారు.బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఫీజు రివర్స్ మెంట్ పై పోరాట ని ర్వహిస్తామన్నారు.మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,డ్రాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, విద్యను ప్రాధా న్యతగా తీసుకోకపోవడం వల్లనే సమాజంలో మార్పు రావడం లేదన్నారు. కేసీఆర్ హయాం లో గురుకులాలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు.

ఈ సమావే శంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీసీ సంఘ నేతలు మిరియాల యాదగిరి, దుదుకు లక్ష్మీనారాయణ, ప్రైవేట్ కళాశాలల సంఘ నేతలు మారం నాగేందర్, హనుమంతు యాదవ్, బీఆర్‌ఎస్వి, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎంఎస్‌ఎఫ్ నేతలు నాగార్జున, నరేష్, మహేష్  పాల్గొన్నారు.