22 August, 2026 | 1:46 AM

ఊడిన ప్రైవేటు స్కూల్ బస్సు చక్రం

22-08-2026 12:39 AM

మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు చక్రం ఊడిపోయింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో బస్సు అక్కడే నిలిచిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది పిల్లలు ఉండగా, వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని, బస్సు ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరిశీలించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికైనా అధికారుల స్పందించి బస్సుల ఫిట్నెస్ పై పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.