30 June, 2026 | 2:10 AM

ప్రజావాణికి 48 దరఖాస్తులు

30-06-2026 12:28 AM
  1. అధికారుల సమన్వయంతో పరిష్కారానికి కృషి
  2. కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, జూన్ 29 : జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 48 దరఖాస్తులు రాగా పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలని, ఇందు కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రజావాణిలో ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.