30 June, 2026 | 2:12 AM

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే

30-06-2026 12:30 AM

నిర్మల్, జూన్ 29 (విజయక్రాంతి) : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదును స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్న పోలీస్ శాఖలు సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.