14 July, 2026 | 4:07 AM

ప్రజావాణిలో 114 దరఖాస్తులు

14-07-2026 01:10 AM

దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో  ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 114 దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను కలెక్టర్ స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.  అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం పెండింగ్ దరఖాస్తుల పై ఆరా తీశారు. తహసీల్దార్ లు, ఆయా శాఖల అధికారులు ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులతో  పాటు, ఆయా సంక్షేమ, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు,  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వి గిరి, పీడీసీ రవితేజ, డి ఆర్ ఓ పాండు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.