కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ సర్పంచ్
తాడ్వాయి, జూలై 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ బీరయ్య సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సర్పంచ్ బీరవ్వకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎర్రపహాడు గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు.
గ్రామంలోని పాఠశాల మరమ్మతుల కోసం రూ 17 లక్షల ఖర్చు చేశారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందున తాను ఆకర్షితురాలని అయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, నాయకులు గైని శివాజీ, మేకల రాజు, సుధాకర్ రావు, గడ్డం ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.






