24-11-2025 10:12:34 PM
భద్రాచలం (విజయక్రాంతి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ప్రస్తుతం నడపబడుచున్న తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS)లో ఖాళీ ఉన్న వివిధ పోస్టులలో నియమకం పొందుటకు తగు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి భోదన, బోదనేతర ఖాళీ పోస్టుల కొరకై దరఖాస్తులను కోరుచున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భోదన, బోధనేతర సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులు(ఔట్ సొర్సింగ్ ప్రాతిపదికన)గా ఉద్యోగ నియామకం చేయటం జరుగుతుందని, భోదన సిబ్బందిగా పని చేయుటకు అభ్యర్థుల యొక్క విద్యార్హతలలో పొందిన మార్కుల ఆధారంగా, డెమో ద్వారా ఎంపిక చేయబడునని, భోధనేతర సిబ్బందిగా పనిచేయుటకు గిరిజన అభ్యర్థుల యొక్క విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని ఆయన అన్నారు.
భోదన, బోధనేతర సిబ్బంది పోస్టుల యొక్క విద్యార్హతలు మరియు ఖాళీల వివరములు:
1) టిజిటి (TGT) ఇంగ్లీష్-1. ఏదైనా యూనివర్సిటీ నుండి 50% మార్కులతో సంబంధిత డిగ్రీ పూర్తిచేసి వుండవలెనని మరియు B.Ed పూర్తిచేసి, CTET పేపర్ –2 పాస్ లేక తెలంగాణ TET పాస్ అయి వుండి సిబిఎస్ఈ ఇంగ్షీషు మీడియంలో బోధన ప్రావీణ్యత కలిగి వుండవలెనని,
2) లైబ్రెరియన్ -01- సంబంధిత డిగ్రీ BLIS తో పాటు MLIS కూడా పూర్తిచేసి యుండవలెనని,
3) సెక్యూరిటీ గార్డ్ పురుషులు (24) పోస్టులు, పదవతరగతి పూర్తి చేసి యుండవలెననీ, (Ex. Serviceman కు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును),
4) ల్యాబ్ అటెండెంట్ -01-పోస్ట్ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి ల్యాబ్రేటర్ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో సాధించియుండవలెను.
లేదా
గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి సైన్స్ స్ట్రీమ్‌తో ఇంటర్ పూర్తి చేసి యుండవలెననీ,
5) మెస్ హేల్పర్-పురుషులు-12 పోస్టులు- స్త్రీలు-06-పోస్టులు-10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెనని,
6) వంట మనిషి(కుక్) పురుషులు-02- పోస్టులు10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెనని మరియు వంట చేసినట్లు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని,
7) స్వీపర్/హౌస్ కీపింగ్-పురుషులు-08-స్త్రీలు- 03-పోస్టులు-10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెనని,
8) గార్డినర్-02 పోస్టులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెనని ఆయన అన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది: 25-11-2025 నుండి తేది: 10-12-2025లోగా దగ్గరలోని ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS)లో తమ ధరఖాస్తులను సమర్పించవలెను మరియు TGTWRS(G), భద్రాచలం నందు కూడా సమర్పించవచ్చును అలాగానే ధరఖాస్తు ఫారంలు(ఉచిత రుసుంతో) కూడా పైన తెలిపిన సంబంధిత సంస్థలోనే మాత్రమే అందుబాటులో ఉండును. సంబంధిత వివరాల కొరకు ఈ కింది తెలిపిన చరవాణి నెంబర్ ల ద్వారా సంప్రదించవచ్చును.
క్ర.సం. విద్యాలయాల పేరు (EMRS) సంప్రదించవలసిన నెం.(ప్రిన్సిపాల్)
1) గండుగులపల్లి -9614390733
2) పాల్వంచ- 8777795179
3) గుండాల - 8896574291
4) టేకులపల్లి- 8447080760
5) దుమ్ముగూడెం -9411083600
6) చర్ల - 7895253577
7) ములకలపల్లి- 9467215038
8) సింగరేణి- 8896507158
9) TGTWRS(G), -భద్రాచలం 7893456472
అభ్యర్థులు తమ ధరఖాస్తులను కార్యాలయ పనివేళలో మాత్రమే స్వీకరించబడునని, ఏదైనా సమాచారం కొరకు సంప్రదించవలసిన RC కార్యాలయపర్యవేక్షకులు(సూపరింటెండెంట్)పోన్ నెంబర్:9000309979 ఫోన్ చేయాల్సిందిగా కోరారు.