calender_icon.png 24 November, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ సెక్రటరీ వల్ల మరణించిన కుటుంబాన్ని ఆదుకోండి

24-11-2025 09:02:32 PM

మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండి స్వామి..

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేగుంట మండలం పొలంపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి బాధిత కుటుంబానికి, హామీ ఇచ్చిన ఆర్డిఓ, తాహసిల్దార్, ఎంపీడీవో, డిఎల్పిఓ ఒక ఎకరా ప్రభుత్వ భూమిని ఇవ్వాలని మల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలెక్టర్ ను కలిశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్యామల అశోక్, డిపిఎఫ్ నాయకులు సంజీవ్, మాల మహానాడు శంకరంపేట్ మండల అధ్యక్షుడు సంజు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.