24-11-2025 08:56:39 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని ప్రదీప్ న్యూరో వైద్యులు మనోజ్ భరత్ కు సోమవారం వైద్యులు మెడికల్ అసోసియేషన్ సభ్యులు సన్మానం చేశారు. ఇటీవలే ఆయనకు అవార్డు రావడంతో వైద్యుడిని సన్మానం చేసి అభినందనలు తెలిపారు. శాలువతో సన్మానం చేసి పూలగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల ప్రమోద్ నేరెళ్ల ప్రదీప్ కృష్ణమోహన్ గౌడ్ బద్రి శ్రీనివాస్ సాదం అరవింద్ తదితరులు ఉన్నారు.