24-11-2025 08:36:51 PM
తాండూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రతి ఆడపడుచుకు ఇందిరమ్మ చీర పంపిణీ చేయనున్నట్లు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద నాయక్ అన్నారు. నేడు ఆయన కందనెల్లి తండాలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు, ఆడపడుచులకు సంక్షేమంలో పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.