calender_icon.png 24 November, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన నూతన డీసీపీ

24-11-2025 08:50:42 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి నూతన డీసీపీగా బాధ్యతలు చేపట్టిన రాంరెడ్డి సోమవారం గోదావరిఖని సబ్ డివిజన్ కార్యాలయంను పరిశీలించారు. ఈ సందర్భంగా ‌సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రత, నేరా నియంత్రణ చర్యలు, ప్రజలతో పోలీసింగ్ పనితీరు, ప్రజా సేవల అమలు విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు డీసీపీ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధి స్టేషన్ ల వారీగా నేర గణాంకాలు, భద్రత చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. మొదటిసారిగా కార్యాలయానికి వచ్చిన డీసీపీకి ఏసీపీ మడత రమేష్ పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికారు.