calender_icon.png 24 November, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగనాయక సాగర్ పైపుల చోరీ

24-11-2025 08:42:58 PM

- నిందితులపై కేసు 

- రూ.40లక్షల విలువైన 60 టన్నుల ఇనుము స్వాధీనం

సిద్దిపేట క్రైం: గాడిచర్లపల్లి శివారులోని మేఘా కంపనీ యార్డ్ లో రంగనాయక సాగర్ కాలువకు సంబంధించిన 8 ఇనుప పైపులను దొంగిలించిన కేసులో పదకొండు మందిని అరెస్టు చేసినట్టు సీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. మేఘా కంపెనీలో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పైపులకు పెయింటింగ్ వర్కర్ గా గతంలో పని చేశాడు. ఇదే కంపెనీలో బీహార్ కు చెందిన రోహిత్ తంతి వెల్డింగ్ పనులు చేశాడు. ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. గతంలో రోహిత్ ఇదే కంపెనీలో పైపులు దొంగిలించిన అనుభవం ఉన్నది. కంపెనీలో పైపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వారికి తెలుసు. ఇద్దరు పైపులను దొంగలించి అమ్మడానికి సిద్దిపేటకు చెందిన స్క్రాప్ ఓనర్ కాకి శ్రీనివాస్ ను సంప్రదించారు. అతడు అందుకు అంగీకరించాడు.

గతంలో మేఘా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ములుగు సాయి సహకారంతో అక్టోబర్ 26, 27, నవంబర్ 11 తేదీల్లో రెండు దఫాలుగా  ఐరన్ పైపులను ముక్కలుగా చేసి క్రేన్ల ద్వారా లారీలలో లోడ్ చేశారు. శ్రీనివాస్ చెప్పిన విధంగా మనోహరాబాద్, శంకరంపేట ఐరన్ కంపెనీలలో విక్రయించారు. వచ్చిన డబ్బులు వెంకట్ రెడ్డి, రోహిత్ తంతి, శ్రీనివాస్, సాయిలు పంచుకున్నారు. ఈ విషయమై మేఘా కంపెనీ ఉద్యోగి బోసయాల సాగర్ సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 19 న ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశానుసారం ఏసీపీ రవీందర్ రెడ్డి అధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మొగిలి సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి ఈ నెల 23న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేశారు.

వారి నుంచి రూ.40లక్షల విలువ గల 60 టన్నుల ఇనుము, రూ. 3,95,000 నగదు, రెండు క్రేన్లు, ఒక బొలెరో వాహనం, నాలుగు గ్యాస్ కట్టింగ్ మిషన్లు, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో గల గాడిచర్లపల్లి శివారులో గల మెగా కంపనీ యార్డ్ లో ఉన్న రంగనాయక సాగర్ కాలువకు సంబందించిన 8 ఇనుప పైపులను దొంగిలించినారని మెగా కంపెనీ వారు అయిన బోసయాల సాగర్ ఫిర్యాదు మేరకు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు తేది: 19-11-2025 నాడు కేసు నమోదు చేయగ, దర్యాప్తులో భాగంగా సిద్దిపేట జిల్లా కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి అధ్వర్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మొగిలి, సిబ్బంది బృందాలుగా ఏర్పడి తేది: 23-11-2025 రోజున ఇట్టి కేసులో నేరస్తులు అయిన...

1. రోహిత్ తంతి, బీహార్ నివాసి (గతంలో మెగా కంపెనీలోని వెల్డింగ్ పని చేశాడు) 

2. చాల మల్ల వెంకట్ రెడ్డి, 

3. ములుగు సాయికుమార్ , 

4:  కాకి శ్రీనివాస్, సిద్దిపేట, 

5. MD. లియాఖత్ , 

6. MD. వాజిద్

7. నేరెళ్ల శ్రీకాంత్ 

8. ముంగిస్పల్లీ 

9. పొన్నాల రమేష్, 

10. పొన్నాల సతీష్, 

11. పవన్,

వీరిని అరెస్ట్ చేయనైనది. వెంకట్ రెడ్డి గతంలో మెగా కంపెనీలో పైపులకు పెయింటింగ్ వర్క్ కాంట్రాక్ట్ గా పని చేసినాడు. రోహిత్ తంతి (బీహార్) అదే మెగా కపెనీలో పైపు వెల్డింగ్ కాంట్రాక్టు చేసినాడు. ఇద్దరికీ ముందే పరిచయం ఉంది ,గతంలో రోహిత్ కు ఇదే కంపెనీలో పైపులు దొంగిలించిన అనుభవం ఉన్నది. కంపెనీలో గల పైపులు ఎక్కడెక్కడ ఉన్నావో వారికి తెలుసు. పై ఇద్దరు పైపులను దొంగలించి అమ్ముదామనుకొని వారికి పరిచయమున్న సిద్దిపేటకు చెందిన స్క్రాప్ ఓనర్ కాకి శ్రీనివాస్ ను సంప్రదించి, దొంగ సొత్తును అమ్మి ఇవ్వమని అడుగగా, అతడు అమ్మిస్తానని ఒప్పుకొనగా, గతంలో మెగా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన ములుగు సాయితో సహకారం తీసుకొని, తేది: 26/27-10-2025, 11-11-2025 లలో రెండు దఫాలుగా ఐరన్ పైపులను కట్ చేసి ముక్కలుగా చేసి క్రేన్ల ద్వారా, లారీలలో తీసుకెళ్లి స్క్రాప్ ఓనర్ శ్రీనివాస్ చెప్పిన విధంగా అట్టి లారీ లోడును మనోహరాబాద్ ఐరన్ కంపెనీలో మరియు శంకరంపేట ఐరన్ కంపెనీలో వేసి వచ్చిన డబ్బులు వెంకట్ రెడ్డి, రోహిత్ తంతి, శ్రీనివాస్, సాయిలు పంచుకున్నారు. 

వీరి వద్ద నుండి...

A). 40-లక్షల విలువ గల 60-టన్నుల ఇనుము

B). నగదు 3,95,000/- రూపాయలు,

C). రెండు క్రేన్లు, 

D). ఒక బొలెరో వాహనం, 

E). నాలుగు గ్యాస్ కట్టింగ్ మిషన్లు,

F). రెండు లారీలు,

స్వాధీన పరచుకోవడం జరిగింది. ఇట్టి కేసులో దొంగిలించబడిన మొత్తం సోత్తు అయిన ఇనుము 40 లక్షలు రికవరీ చేయడం జరిగింది.