calender_icon.png 24 November, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేపై రాంగ్ రూట్ వద్దు ప్రాణమే ముద్దు: సీఐ వెంకట్ రెడ్డి

24-11-2025 08:25:06 PM

సిర్గాపూర్/కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ... కల్హేర్ మండలంలోని 161వ జాతీయ రహదారిపై వాహనదారులు రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మాసన్ పల్లి, మహదేవ్ పల్లి, నిజాంపేట వరకు ఉన్న ఈ హైవేపై వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.