calender_icon.png 12 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటిలోగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

12-08-2025 12:50:42 AM

సూర్యాపేట ఆగస్టు 11 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్యర్యంలో ప్రతి సంవత్సరం అమలవు తున్న రైతు భీమా పథకంలో భాగంగా నూతనంగా జూన్ 5, 2025 లోపు పట్టా పాస్ బుక్ వచ్చినవారు,

ఇప్పటివరకు రైతు భీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు రేపటి (13 వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  రైతు భీమా నమోదు చేసుకున్న రైతు ఏ కారణం చేతనైనా మరణించినట్లైతే నామినికి రూ.5 లక్షల ఆర్దిక సహాయం అందిచబడుతుంధని తెలియజేశారు.