12-08-2025 01:17:36 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక కూడా..
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ చేస్తోందని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఎంపీలు సంసద్ భవ న్ నుంచి ఈసీ కార్యాలయానికి సోమవారం తలపెట్టిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాదాపు 25 పార్టీలకు చెందిన 300 మంది ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణ (సంసద్ భవన్) నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం (నిర్వచన్ సదన్) వరకు ర్యాలీగా చేస్తుంటే మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో పోలీసులు పలువురు ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేసి.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వ యనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, జైరాం ర మేష్‌లతో సహా ఇండియా కూటమి ఎం పీలు ఉన్నారు. అంతకు ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ‘ఇండియా’ కూటమి ఎంపీల ర్యాలీని అడ్డుకునే ప్రయ త్నం చేశారు.
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఇండియా కూటమి ఎంపీ లు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకా రు. నినాదాలతో హోరెత్తించారు. ర్యా లీ సం దర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు మహువా మొయిత్రా, మిథాల్ బా గ్ అస్వస్థతకు గురయ్యారు. సహచర ఎంపీ లు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు.
30 మంది ఎంపీలకే అనుమతి
30 మంది ప్రతిపక్ష ఎంపీలు మాత్రమే కలిసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కు మార్ మహ్లా తెలిపారు. ఈ ర్యాలీలో డీఎంకే నుంచి టీ.ఆర్ బాలు, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రి యాంక గాంధీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమి ఎం పీలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం అపహస్యమవుతోంది..
ఎన్నికల సంఘాన్ని బీజేపీ ‘పోలింగ్ రిగ్గిం గ్ యంత్రం’గా మార్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అరెస్టును ఆయన ఖండించారు. ‘ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహ స్యం చేస్తుంటే మౌనంగా ఉండలేం. రాహు ల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి’ అని డిమాండ్ చేశారు.
అభివృద్ధి జరగాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి
ఓటర్ల సవరణ జాబితాపై ఈసీని కలిసేందుకు ర్యాలీగా వెళ్తున్న ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌ను తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఖండించారు. ‘మన దేశం పూర్తి అభివృద్ధిని సాధించాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజ్యాంగాన్ని రక్షించాలి. ప్రజస్వామ్యానికి పునాది స్వేచ్ఛాయుత ఎన్నికలే. మా పార్టీ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రజ ల విశ్వాసాన్ని నిర్ధారించే ఎన్నికలు నిర్వహించాలి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అరెస్టు అప్రజాస్వామికం: మహేశ్‌కుమార్ గౌడ్
ర్యాలీ చేస్తున్న ఇండియా కూటమి ఎంపీ ల అరెస్ట్ అప్రజాస్వామికం అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అ న్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీ పై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడమేంటి? అని ప్రశ్నించారు.
మా పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
అరెస్టు చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాము పోరాడుతున్నామని, నిజం దేశం ముందుందని పేర్కొన్నారు. రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అనంతరం విడుదల చేశారు. విడుదల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నిజం దేశం ముందుంది. ఈ పోరాటం రాజకీయపరమైనది కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం. దేశంలోని ప్రతిపక్షాలన్నీ పారదర్శకంగా ఉన్న ఓటర్ జాబితాను కోరుతున్నాయి’ అని అన్నారు.
రాహుల్ సంకల్పం ముందు జైలు చిన్నది: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంక ల్పం ముందు జైలు చాలా చిన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. ‘రాహుల్‌గాంధీ సంకల్పాన్ని జైల్లు అణిచివేయలేవు.. విపక్ష సభ్యుల నోళ్లను మూయించలేవు ’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
అలర్లు సృష్టించేందుకే: ధర్మేంద్ర ప్రధాన్
గత ఎన్నికల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని సోమవారం ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీ చేపట్టడాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుబట్టారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్, ప్రతిపక్షాలు దేశం లో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నా యి’ అని దుయ్యబట్టారు. బీహార్ ఓ టర్ల జాబితా సవరణ గురించి ఏవైనా సందేహాలుంటే ఆ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఆయన కాంగ్రెస్, విపక్షాలను కోరారు.