calender_icon.png 12 August, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు!

12-08-2025 01:12:28 AM

42 % బీసీ కోటా సాధనే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా అమలు చేయాల్సిందే..

రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు

కేంద్రంపై నెపం నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోలేదు..

విజయక్రాంతిఇంటర్వ్యూలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

* తెలంగాణలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆ ఎవరైనా హక్కును కాలరాయాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. బీసీలకు 42శాతం కోటా కేటాయించాల్సిందేనని, సీఎం రేవంత్‌రెడ్డి తాము పంపించిన బిల్లులకు ఆమోదం తెలపడం లేదని కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రిజర్వేషన్లపై నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. బీసీ కోటా విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే బీసీలంతా కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారని హెచ్చరించారు. అలాగే బీసీ రిజర్వేషన్లు, కుల గణన, తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ‘విజయక్రాంతి’కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 11 (విజయక్రాంతి) :

మీరు నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీల హక్కుల కోసం 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. మీ ఉద్యమాలకు ప్రేరణ ఏంటి? 

కళ్ల ముందే బీసీ కులాలు సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అణచివేతకు గురవ్వడమే నా పోరాటానికి ప్రేరణ. నేను కురుమ కులంలో, భూస్వామ్య కుటుంబం లో పుట్టినా, సమాజంలో బీసీలు పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి చూశాను. వా ళ్లకు చదువు లేదు. ఉద్యోగాల్లో సమాన అవకాశాలు లేవు. మండల్ కమిషన్ సిఫారసు లు నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. మా కుటుంబం నాకు మంచి విద్యను అం దించింది. ఆ చదువు మూలంగా నేను బీసీ ల సమస్యలపై అవగాహన పెంచుకున్నాను. 

మీరు గతంలో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆ ప్రస్థానం ఎలా సాగింది?

నా రాజకీయ ప్రయాణమంతా బీసీల సాధికారత కోసమే. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల సాధన కోసం  పోరాడాను. వైఎస్సార్ సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా జాతీయ స్థాయిలో బీసీల సమస్యలను, ముఖ్యంగా కుల గణన ఆవశ్యకతను బలంగా వినిపించాను. ఇప్పుడు బీజే పీలో చేరడం కూడా బీసీల ప్రయోజనాల కోసమే. జాతీయ స్థాయిలో అధికారంలో ఉ న్న పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా పోరాటం పదవుల కోసం కాదు.

మీరు ఇన్ని రాజకీయ పార్టీలు మారడానికి కరణం?

నేను ఏ రాజకీయ పా ర్టీ దగ్గరికీ వెళ్లి ‘న న్ను మీ పార్టీలో చేర్చుకోండి’ అని అడగలే దు. భవిష్యత్తులోనూ అడగను. నా సిద్ధాంతాలు నచ్చి, నన్ను పార్టీలో చేర్చుకోవాలని వారే నా దగ్గరికి వచ్చారు. ము ఖ్యంగా, బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో, ఆ పార్టీలోనే నేను చేరతాను. ఒక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు బీసీని ము ఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి, నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, బీసీల ముఖ్య మంత్రి కావాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీ లో చేరాను. అంతే తప్ప, నేను ఏ పార్టీలో నూ చేరలేదు. నా ఉద్యమం నచ్చి, ఆ పార్టీ లు నన్ను ఆహ్వానించి చేర్చుకున్నాయి. బీజే పీ, వైఎస్సార్ సీపీ విషయంలోనూ ఇదే జరిగింది. బీసీల సంక్షేమం కోసం, వారి మంచి కోసం కృషి చేసే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను వారికి కృతజ్ఞతతో ఉంటాను.

కుల గణన, పంచాయతీ ఎన్నికలు బీసీల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

కుల గణన ప్రక్రియ ద్వారా రాష్ర్టంలో 56.33% బీసీలు ఉన్నారని తేలింది. ఇదొక చారిత్రాత్మక విజయం. ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో బీసీలకు జనాభా దామాషా ప్రకా రం నిధులు, రిజర్వేషన్లు అందుతాయి. కానీ, ప్రభుత్వం ఈ డేటాను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నది. పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా వాయిదా వేయడం బీసీల రాజకీయ హక్కులను కాలరాయడమే. ఆర్థికంగా, ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవ డం వల్ల లక్షలాది బీసీ వి ద్యార్థుల భవిష్యత్తు అం ధకారంలో పడింది.

సీఎం బీసీ కోటాకు చేస్తున్న యత్నాలను మీరెలా చూస్తారు ? 

నాకు సీఎం చర్యలపై అస్సలు సంతృప్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిం చి మోసం చేసింది. కాంగెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంతోపాటు కోర్టులపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నది. ఇది ముమ్మాటికీ బీసీలకు చేస్తున్న ద్రోహమే. ప్రభుత్వం ఇటీవల నియమించిన ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో ఒక్క బీసీకి కూడా స్థానం కల్పించలేదు. దీన్ని బట్టే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది.

బీసీల పట్ల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విధానాలు ఎలా ఉన్నాయి ?

బీసీల విషయంలో మూడు పార్టీలు  ర కాలుగా ద్రోహపూరితంగానే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో బీసీలకు 34% ఉ న్న రిజర్వేషన్లను 22%కి తగ్గించింది. తద్వా రా రాజకీయంగా బీసీల గొంతు నొక్కింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42% కోటా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మాట తప్పుతున్నది. బీజేపీ మాత్రమే జాతీయ స్థాయిలో కుల గణనకు, బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఉంది. అందుకే బీసీల ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో పోరాడేందుకు బీజేపీయే సరైన వేదిక అని నేను భావిస్తున్నాను.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కుల గణనపై మీ అభిప్రాయం ఏంటి ?

బీసీల దశాబ్దాల పోరాట ఫలితమే కులగణన. ఈ గణాంకాలు ఇప్పుడు మన చేతి లో ఉన్న బ్రహ్మాస్త్రం. రాష్ట్రంలో 56.33% జనాభా ఉన్న మాకు, మా వాటా మాకు దక్కాలని కోరుకుంటున్నాం. అందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కోటా అమలైతే విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయి. కులగణన బీసీల సామాజిక న్యాయ పోరాటానికి శాస్త్రీయమైన ఆధారాన్ని ఇచ్చింది.

42% బీసీ రిజర్వేషన్ ఎందుకు అవసరం?

రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యా యం. ఇది మేం అడుక్కుంటున్న భిక్ష కాదు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. సుప్రీం కోర్టు 50% పరిమితిని సడలించిన నేపథ్యం లో రాష్ట్రాలు శాస్త్రీయ డేటాతో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కోటా అమలైతే వేలాది మంది బీసీ నాయకులు తయారవుతారు. అదేవిధంగా, విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ కోటా ను అమలు చేయాలి.

గత నెలలో మీ నాయకత్వంలో సీఎంతో భేటీ జరిగింది. భేటీలో 42% కోటా ఆర్డినెన్స్‌పై ఏం చర్చించారు?

ఆ సమావేశంలో మేం చాలా స్పష్టంగా చెప్పాం. 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చే శాం. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుం డా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖ లు చేయాలని సూచించాం. సీఎం రేవంత్‌రెడ్డి అందుకు సానుకూలంగా స్పందిం చారు.. కానీ, ఆచరణలో చూపలేదు.

బీసీ కోటాపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మీరు ఆరోపించారు. దీని వెనుక కారణాలేంమిటి?

అవును. ఇది పచ్చి మోసం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆర్టికల్ 246(6) ప్రకారం స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు కేంద్రంపై నిందలు వేయడం చేతకానితనం. బాధ్యతారాహిత్యం. మూడు నెలలుగా బీసీ బిల్లులను గవర్నర్ వద్ద పెం డింగ్‌లో ఉంచడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. బీసీలు ఐక్యంగా ఉండి రోడ్లెక్కి పోరాడితే తప్ప వీరికి బుద్ధిరాదు.

కులగణన ప్రక్రియ గొప్ప నిర్ణయమన్నారు ? ఎలా?

కులగణన ప్రక్రియ తెలంగాణలో కచ్చితంగా గొప్ప నిర్ణయం. రాష్ట్రప్రభుత్వం చేప ట్టిన కుల గణన.. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు ఆశాకిరణం. ఈ శాస్త్రీయ విధానా న్ని దేశమంతా అమలు చేయాలి. కేంద్ర ప్ర భుత్వం వెంటనే జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలి. అప్పుడే బీసీల నిజమైన జ నాభా తెలిసి, వారి అభివృద్ధికి సరైన పథకాలు రూపొందించడానికి వీలవుతుంది.

ఎమ్మెల్సీ కవితకు మీ మద్దతును ఎలా చూడాలి?

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మాట విననప్పుడు, ప్రజలు రోడ్డెక్కి తమ గళం వినిపిస్తారు. రైల్ రోకో, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి అవే అవసరమైన ఆయుధాలు. బీసీల హక్కుల కోసం ఎవరు పోరాడినా నా మద్దతు ఉంటుంది. శాంతియుత పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోవాలి. అదే అభిమతం.

బీసీ బిల్లులపై ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు అవసరం ?

అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీల మధ్య ఒక రాజకీయ ఏకాభిప్రాయం వస్తుంది. దానివల్ల బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమో దం సులభమవుతుంది. ఎవరైనా కోర్టుల్లో పిటిషన్లు వేసి సవాల్ చేసినా, ప్రభుత్వం బలంగా వాదించడానికి అది ఉపయోగపడుతుంది. బీసీ సంఘాలు సమావేశంలో తమ వాదనలను బలంగా వినిపించాలి.

బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయనే సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తారు?

బీసీ రిజర్వేషన్ల అమలులపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయనేది పచ్చి అ బద్ధం. తన వైఫల్యాన్ని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి దిగజా రుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఇ చ్చే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికే ఉందని తె లిసి కూడా, బీజేపీపై నిందలు వేయడం సిగ్గుచేటు. బీజేపీ ఎప్పుడూ బీసీలకు అండగానే ఉంది. ఇకపైనా ఉంటుంది. కుట్రలు చేసేది ఆ రెండు పార్టీలు కాదు. ప్రజలకు హామీ ఇ చ్చి మోసం చేస్తున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

నా భవిష్యత్తు ప్రణాళికలో మొదటిది. జా తీయ స్థాయిలో కుల గణన సాధించడం. రెండోది.. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వాలు 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చూడటం. మూ డోది.. ప్రైవేటు రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయించడం. తెలంగాణ మాడల్‌ను ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించి, బీసీలందరినీ ఏ కం చేసి, జాతీయ స్థాయిలో బీసీలను ఒక పె ద్ద రాజకీయ శక్తిగా మార్చడమే నా ధ్యేయం.

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాల్సిందేనా?

జాతీయ స్థాయిలో బీసీల పరిస్థితి దయనీయంగా ఉంది. ముస్లిం బీసీలతో సహా అ నేక కులాలు ఇప్పటికీ గుర్తింపునకు నోచుకోలేదు. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం దేశ వ్యాప్త కుల గణన. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలి. కుల గణన చేపట్టినప్పుడే ఏ వర్గానికి, ఎంత అన్యాయం జరుగుతోందో తెలుస్తుంది. తద్వారా ఇప్పటివరకు న్యాయం జరగని వర్గాలకూ న్యా యం జరుగుతుంది. బీసీ యువతకు నేను చెప్పేది ఒక్కటే. బాగా చదువుకోండి. మీ హక్కుల గురించి తెలుసుకోండి. ఐక్యంగా ఉండండి. బీసీలను విడదీయాలని చూసే రాజకీయ పార్టీల కుట్రల ను తిప్పికొట్టండి. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనండి. నా యకులెవరూ ఆకాశం నుంచి ఊడిపడరు. మనలో నుంచే పుడతారు. రిజర్వేషన్లు ఎవ రు విసిరేసే భిక్ష కాదు. 

స్థానిక ఎన్నికలు 42% కోటా ప్రకటన తర్వాతే జరగాలని ఎందుకంటున్నారు?

42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే, పంచాయతీల్లో వేలాది మంది బీసీలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోతారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. అందుకే రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలి. దీనిపై మేం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే, ఎన్నికలను బహిష్కరించడానికైనా, అడ్డుకోవడానికైనా బీసీలు సిద్ధంగా ఉన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ కోటా తగ్గించిందని మీరు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటా పెంచుతున్నా.. మీ సమస్యేమిటి?

బీఆర్‌ఎస్ చేసింది చారిత్రక ద్రోహం. కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పుడు బీసీలకు 42% కోటా అని చెప్పి, అమలు చేయకుండా నాటకమాడుతున్నది. ఆ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే. అది  బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం. చట్టం చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం మరో ఎత్తు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విషయంలో పూర్తిగా విఫలమైంది.

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి?

రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల వాటికి న్యాయ సమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది. అప్పుడు ఏ ప్రభుత్వమూ కోర్టుల పేరు చెప్పి రిజర్వేషన్లను తగ్గించలేదు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇలాగే అమలవుతున్నాయి. మేం త్వరలో ప్రధాని మోదీని కలిసి, దేశవ్యాప్త కుల గణన చేపట్టాలని కోరతాం. 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల చేర్పు గురించి మాట్లాడతాం. ప్రైవేటు రంగంలో బీసీ రిజర్వేషన్లపై మెమోరాండం సమర్పిస్తాం.