calender_icon.png 8 May, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి

07-05-2025 05:35:44 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను సృష్టించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ జిల్లాకు మేనేజర్ ఈడిసి అసిస్టెంట్ మేనేజర్ ఈడిసి పోస్టులను కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఇట్టి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మే 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు www.nimsme.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని, ఇతర వివరాలకు జిల్లా మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం రూమ్ నెంబర్ F-5, కలెక్టరేట్ (IDOC)లో సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.