calender_icon.png 8 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్ లోనే ప్రసవం

07-05-2025 05:27:12 PM

తల్లి, బిడ్డ క్షేమం..

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని కాటేపల్లి గ్రామంలో బుధవారం 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవించిన ఘటన పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలో జరిగింది. పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లికి చెందిన మెనూరి లక్ష్మికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. 108లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. ఆడ శిశువు జన్మించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ బాలరాజు తెలిపారు. 108 అంబులెన్స్ కాల్ చేయగానే సిబ్బంది తక్షణమే స్పందించినందుకు చాలా సంతోషంగా ఉందని 108 సిబ్బంది ఈఎంటి బాలరాజుకు, పైలెట్ కారడి సాయిలు కు కృతజ్ఞతలు తెలిపారు.