15-05-2025 01:59:10 AM
భద్రాచలం, మే 14. (విజయ క్రాంతి): సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఖమ్మం ఆర్ సెటి ,ఐ.టీ.సీ ప్రథమ్, భద్రాచలం ద్వారా ఒక్కొక్క కోర్స్ కు పది రోజుల నుండి 45 రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణలు కల్పించుటకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యూటీషియన్ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి నుండి ఆ పైన కోర్సులు చదివి ఉండాలని, 30 రోజుల శిక్షణ ఉంటుందని, ఐటిసి ప్రధమ్ భద్రాచలం నందు శిక్షణ ఉంటుందని, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ శిక్షణకు 10వ తరగతి లేదా ఆపైన కోర్సులు చదివి ఉండాలని, 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, ఐటిసి ప్రథమ్ బూర్గంపాడు నందు శిక్షణ ఉంటుందని, టైలరింగ్ శిక్షణకు పదో తరగతి లేదా ఆపైన కోర్సులు చదివి ఉండాలని, 31 రోజులు శిక్షణ ఉంటుందని, పుట్టగొడుగుల పెంపకం శిక్షణ కొరకు ఏడవ తరగతి లేదా ఆపైన కోర్సులు చదివి ఉండాలని, పది రోజులపాటు శిక్షణ ఉంటుందని, జ్యూట్ బ్యాగ్స్ మేకింగ్ శిక్షణకు పదో తరగతి లేదా ఆపైన కోర్సులు చదివి ఉండాలని, 13 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, వై టి సి భద్రాచలం , వైటీసీ ఖమ్మంలో శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు.
శిక్షణ కాలంలో ఉచిత భోజనం , వసతి సౌకర్యం కల్పించబడుతుందన్నారు., ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్కు, బ్యాంకు పాస్ బుక్ , రెండు ఫోటోలతో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. పూర్తి సమాచారం కొరకు 630 2608905, 81438 40 906 ఫోన్ నెంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలన్నారు.