పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి
సదాశివనగర్, సెప్టెంబర్ 2 : అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం రాజు డిమాండ్ చేశారు.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో జిల్లాలోని అనేక గ్రామాలలో పెద్ద మొత్తంలో పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరిగిందని, ఈ మేరకు సోమవారం యెల్లారెడ్డి నియోజకవర్గంలోని సదశివా నగర్ మండలంలో ధర్మారావుపేట గ్రామం లో పర్యటించి పంట నష్టంను పరిశీలించి, రైతులతో మాట్లాడరు.
జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి, రైతులకు వంట నష్టంను ఎకరాకు 50 వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని రైతు వారిగా అంచనా వేసి ఈ ప్రభుత్వానికి నివేదిక అందించాలని అలాగే నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వము నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్శి రవీందర్ రావు,మండల పార్టి అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహిపాల్ యాదవ్,జిల్లా నాయకులు గంగారెడ్డి, సాయిలు,మండల నాయకులు జైపాల్ రెడ్డి, కిషన్, అనిల్ రెడ్డి, సత్యము రెడ్డి, సుదర్శన్ రెడ్డి,గంగన్న, రమేష్ రెడ్డి, కటిక రమేష్,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.






