30 August, 2026 | 10:34 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ భేష్

20-05-2024 02:08 AM

తమిళనాడు జియోగ్రఫీ నిపుణులు

హైదరాబాద్, మే 19 (విజయక్రాం తి): పల్లెలకు ప్రధాన నీటి వనరులు బావులు, చెరువులు. కాలక్రమంలో   బావుల్లో  నీటిమట్టం తగ్గిపోగా చెరువు లు పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి.  ఈ అంశాన్ని గమనించిన నాటి ప్రభుత్వం మిషన్ భగీరథ  పథకానికి  శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ఎన్నో సంస్థలు  ప్రశంసలు కురిపించాయి. కేంద్ర జలశక్తి శాఖ  గత సంవత్సరం అధ్యయనం చేసి నివేదికను విడుదల చేసింది. దీని గణాంకాల ఆధారంగా చేసుకుకుని  దేశంలోనే అత్యధిక నీటి వనరులున్న రాష్ట్రం తమిళనాడు అని పేర్కొంటూ ద్రవిడియన్ ఇన్‌సైట్స్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించగా  తమిళనాడు జియోగ్రఫీ నిపుణులు బృందం దీన్ని ఖండించారు.

దేశంలోనే అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రం తెలంగాణ నిలుస్తుందని ఎందుకంటే రాష్ట్రం చెరువు లను ట్యాంక్‌లుగా  వర్గీకరించిందని, తమిళనాడు లేక్స్‌గా పిలుస్తుందని వివరించారు. నీటి వనరుల  పునరుద్ధరణ కోసం తమిళనాడు 50 సంవత్సరాల్లో చేసిన ఖర్చును తెలంగాణ కేవలం పదేండ్లలో అనేక చెరువులను బాగు చేసిందని కొనియాడింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జీవనాడి గొలుకట్టు చెరువులు నిర్లక్ష్యానికి గుర య్యాయి. పూడిక చేరి కట్టలు కరిగి బోసిపోయాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకే పెద్ద పీట  వేసి తెలంగాణలోని  ఉన్న చెరువులను మైనర్ ఇరిగే షన్ కింద చూపుతూ ఆ ప్రాంతాలకు ఆయువు పట్టుగా ఉన్న  చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ప్రభుత్వం గుర్తించింది.

ఇందులో భాగంగా రాప్ట్ర వ్యాప్తంగా46,531 చెరువులు ఉన్నట్లుగా గుర్తించింది. వీటి కింద  24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించి ప్రతి సంవత్సరం  20 శాతం పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా నాటి ముఖ్యమంత్రి 2015 మార్చి 12న  నిజామబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి నియోజక వర్గంలో సదాశివనగర్ పాత చెరువుకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశల్లో రూ.9155 కోట్లతో 27,627 చెరువులకు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఐదవ దశలోనూ మిగిలిన చెరువులకు శాశ్వత జలకళ తీసుకు వచ్చేందుకు ప్రాజెక్టులతో  అనుసంధానం చేశారు. మొత్తం ప్రాజెక్టు కమాండ్ ఏరియాలో  20 వేలకు పైగా చెరువులను ఈ ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని10 వేల చెరువులను అనుసంధానం చేశారు.