13 May, 2026 | 2:14 AM

జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకం

13-05-2026 12:29 AM

అలంపూర్, మే 12:గద్వాల జిల్లా ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా అలంపూర్ నియోజకవర్గం నుంచి ముగ్గురికి అవకాశం కల్పించడం అభినందనీయమని ఈ ప్రాంతా నాయకులు కొనియాడారు. అల్లంపూర్ కి చెందిన నరసింహులు అయిజకు చెందిన మాల మల్లికార్జున్ అదే పట్టణానికి చెందిన భుక్య శైలజను నియమించారు.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కలిసి ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం సంపత్ కుమార్ కమిటీ సభ్యులను శాలువా కప్పి అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దీపక్ ప్రజ్ఞ, అయిజ కౌన్సిలర్ మాస్టర్ షేక్షావలి ఆచారి తదితరులు పాల్గొన్నారు.