calender_icon.png 26 July, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

26-07-2025 12:47:09 AM

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు పది మంది ప్రత్యేక ఆఫీసర్లుగా ఐఏఎస్‌లను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు సీ.హరికిరణ్, నల్గొండకు అనితా రామచంద్రన్, హైదరాబాద్‌కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కే.సురేంద్రమోహన్, నిజామాబాద్‌కు హనుమంతు, రంగారెడ్డికి దివ్యా, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్‌నగర్‌కు రవి, వరంగల్‌కు కే.శశాంక, మెదక్ జిల్లాకు ఏ.శరత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.