26-07-2025 12:48:02 AM
వేములవాడ టౌన్ జూలై 25 (విజయక్రాంతి) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ.. ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఇబ్బందులు దూరం చేసింది.కలెక్టర్ బుధవారం వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కట్టెల పొయ్యి పై వం టలు సిద్ధం చేస్తూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించారు. వెంటనే ఆ పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం హన్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ అందజేశారు.దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆహార పదార్థాలను గ్యాస్ స్టవ్ పైనే సిద్ధం చేశారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ తో తమ పాఠశాలలోని కట్టెల పొయ్యి దూ రమై గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు తెలిపారు.