26-07-2025 12:46:31 AM
జగిత్యాల అర్బన్, జులై 25(విజయ క్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోలడ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి అదికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ ద్వారా ప్రజల్లో భద్రత భావం ను పెంపొందించడం జిల్లా పోలీసుల లక్ష్యం అని, రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చన్నారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్య క్తులను తనిఖీ చేయడం తో పాటు వారి వేలిముద్రలను సేకరించి, గత నేర చరిత్ర గల నిందితులతో సరిపోల్చడం జరుగుతోందన్నారు. అనుమానాస్పద, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడంజరిగిందన్నారు.