23-05-2025 12:07:36 AM
రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి):- రాష్ర్టంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కా రం లక్ష్యంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం చేపడుతున్నామని రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
తొలివిడతలో ౫వేల మంది లైసె న్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నట్టు చెప్పారు. నక్షాలేని గ్రామాలు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణపై గురువారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరికి ఈనెల 26వ తేదీ నుం చి ౨ నెలలపాటు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
మండలాల్లో భూవి స్తీర్ణం, భూ లావాదేవీలను బట్టి ౬ నుంచి ౮ మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. రిజి స్ట్రేషన్ సమయంలో ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ దగ్గర భూములకు సంబంధించిన డా క్యుమెంట్లతోపాటు సర్వేపత్రాన్ని జతపరచాలని భూ భారతి చట్టంలో పేర్కొనడం జరిగిందని, ఇం దుకు అనుగుణంగా సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.